కొత్త పథకాల్లేవ్! సర్కారు అనౌన్స్‌మెంట్‌పై ఉత్కంఠ

ఫిబ్రవరి చివరి వారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నది.

Update: 2023-01-04 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఫిబ్రవరి చివరి వారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నది. 2023-24 ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌‌ పెట్టేందుకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా పది నెలల కన్నా తక్కువే టైం ఉంది. అయినా పూర్తి స్థాయి బడ్జెట్‌కు రెడీ అవుతున్నది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులను 9 నెలల్లో ఖర్చు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపే నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత కొత్త బడ్జెట్ తయారీపై అధికారులు ఫోకస్ పెట్టనున్నారు. ఇందుకోసం త్వరలో అన్ని శాఖలకు ప్రపోజల్స్ పంపాలని ఆర్థిక శాఖ నుంచి సర్క్యులర్ జారీ అయింది.

ఫిబ్రవరిలో..

ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండటంతో.. అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసిన తర్వాత స్టేట్ బడ్జెట్ తయారు చేయనున్నారు. ఈ లోపు అన్ని శాఖల నుంచి ప్రపోజల్స్ తీసుకోనున్నారు. ఆయా శాఖలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి బడ్జెట్‌ను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి కేంద్రం నుంచి ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అబ్బుర పరిచే స్కీమ్స్ ఉంటాయా?

ఈ ఏడాది సెప్టెంబరు చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది. దీంతో ప్రభుత్వం కొత్తగా ఓట్లు రాల్చే స్కీమ్‌ను ప్రవేశ పెడుతుందా? అనే చర్చ జరుగుతున్నది. ప్రపంచం అబ్బరపడే స్కీమ్స్ తన మదిలో ఉన్నాయని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో ఆ స్కీమ్స్‌ను ఈ సందర్భంగా ప్రకటిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. కానీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొత్త పథకాల జోలికి వెళ్లకుండా, ఉన్న పథకాలకే నిధులను కేటాయించే చాన్స్ ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Also Read... 

ఏపీ లీడర్లకు బీఆర్‌ఎస్​ ఆఫర్లు? సీన్‌లోకి కేసీఆర్!

Tags:    

Similar News