నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీఛార్జ్ పోలీస్! రాత్రి 11 దాటితే అంతేనట? వీడియో వైరల్

హైదరాబాద్ నగరంలో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Update: 2024-06-24 12:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 11 దాటితే నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ అని పోలీసులు మైక్‌లు పెట్టి మరి చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి 10:30 గంటల నుంచి 11 గంటల లోపే పాతబస్తీలో పాన్ షాపులు,హోటళ్లు మూసేయాలని మైక్‌లో పోలీసులు తెలిపారు.

మరోవైపు రాత్రి 11 తర్వాత రోడ్డుపై కూడా ఉండొద్దని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. నగరంలో ఆఫీస్‌లు రాత్రి 11 గంటలకు ముగుస్తుందని, ఆ సమయంలో డిన్నర్ ఎక్కడ చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాగా, హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు పాతబస్తీలో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై రాత్రి సమయంలో చెప్పినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News