‘ఎక్స్ట్రా లు వద్దు’.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకు ఘంటా చక్రపాణి స్ట్రాంగ్ కౌంటర్ .. ఆ ఇష్యూలో ఇద్దరి మధ్య ట్వీట్ వార్

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఘంటా చక్రపాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-06 11:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 'సీఎం రేవంత్ రెడ్డి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగానే తెలుసు, మర్యాదగా ఉండండి. ఎక్స్ట్రాలు వద్దు' అంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇరువర్తి అనిల్ పై టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొ.ఘంటా చక్రపాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై చక్రపాణి స్పందించగా దాంతో ఈ ఇరువురి మధ్య డైలాగ్ వార్ నడిచింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వెళ్లబోతున్నారని, అదే మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో ఎండిపోయిన పండల పరిశీలనకు బయలుదేరారని వీరిద్దరి మధ్య ఎవరి ప్రయార్టీ ఎలా ఉందో గమనించాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఘంటా చక్రపాణి 'సమస్య అంతా ఇక్కడే. ఈరోజు వరకు ఆయన పనికిరాని రాజకీయ నాయకుల ఇళ్లకు తప్ప ప్రజల్లోకి పోలేదు' అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఘంటా చక్రపాణి ట్వీట్ కు స్పందించిన ఇరువర్తి అనిల్.. మూడు పేపర్ లీకులు, ఆరు ప్రశ్నాపత్రాల అమ్మకాల స్థాయికి టీఎస్పీఎస్సీని దిగజార్చి, లక్షలాది మంది నిరుద్యోగుల బతుకులతో ఆడుకున్న “సూడో మేథావి…” ఘంటా చక్రపాణి అంటూ విమర్శించారు. ప్రజాక్షేత్రమే కార్యక్షేత్రంగా.. సామాన్యుడి ముఖ్యమంత్రిగా..., అన్నా.. అని పిలిస్తే పలికే రేవంతన్న గురించి మాట్లాడటం విచిత్రం.. విడ్డూరం!! మాజీ ముఖ్యమంత్రి పదేళ్లు ఫాంహౌస్ నుండి బయటకు రాని నాడు ఏనాడైనా ఈ “సూడో మేథావి” గొంతు విన్నారా!? అంటూ ట్వీట్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగానే స్పందించిన ఘాంటా చక్రపాణి.. 'అనిల్ గారు పేపర్ లీక్ లు, అమ్మకాలకు సంబంధించి సమాచారం నాకు తెలియసు. మీకు చాలానే వాటితో సంబంధం ఉన్నట్టుంది. తెలిసినట్టు ఉంది. నా హయాంలో అలాంటివి జరుగలేదు. జరిగినట్టు మీ దగ్గర సమాచారం ఉంటే సిట్ దృష్టికి తెండి. లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు అవుతారు. నేను మేధావినా, సూడో మేధావినా తరువాత, మీరు మాత్రం చైర్మన్ గా అపాయింట్మెంట్ కాక పోయినా, జీవో రాకపోయినా, ఛార్జ్ తీసుకోక పోయినా చైర్మన్ అని రాసుకుని అలాగే చలామణి అవుతున్నారు. సూడో అంటే అర్థం అదే. చట్టరీత్యా అది నేరం. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత తెలుసు నాకు తెలియదు, నాకు మాత్రం బాగానే తెలుసు. మర్యాదగా ఉండండి. ఎక్స్ట్రా లు వద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య ట్విట్టర్ వార్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News