ఈనెల 10 వరకు యుడైస్ ప్రపోజల్స్ సబ్మిట్ చేయాలి
ప్రస్తుత విద్యా సంవత్సరం 2024 - 2025 నుండి ప్రారంభించిన అన్ని నూతన పాఠశాలలు, కళాశాలలు యుడైస్ కోడ్ అలాట్ కాలేకపోతే వెంటనే ఆయా మండలాల మండల విద్యాధికారి (ఎంఈఓ) లను సంప్రదించి ప్రపోజల్స్ ను పంపాలని జిల్లా విద్యాధికారి, సమగ్ర శిక్ష కార్యాలయం జిల్లా ప్రాజెక్టు అధికారి ఎన్ వీ దుర్గాప్రసాద్ తెలిపారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రస్తుత విద్యా సంవత్సరం 2024 - 2025 నుండి ప్రారంభించిన అన్ని నూతన పాఠశాలలు, కళాశాలలు యుడైస్ కోడ్ అలాట్ కాలేకపోతే వెంటనే ఆయా మండలాల మండల విద్యాధికారి (ఎంఈఓ) లను సంప్రదించి ప్రపోజల్స్ ను పంపాలని జిల్లా విద్యాధికారి, సమగ్ర శిక్ష కార్యాలయం జిల్లా ప్రాజెక్టు అధికారి ఎన్ వీ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఈనెల 10 సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని గడువు దాటిన తరువాత యుడైస్ పోర్టల్ లో మోడ్యుల్ డిజేబుల్ అవుతుందని నేషనల్ టీం తమకు సమాచారం ఇచ్చిందని డీఈఓ తెలిపారు. ప్రపోజల్స్ పంపడానికి గడువు ఈనెల 10 వరకే ఉండటంతో అందరూ త్వరగా పంపించాలని ఆయన కోరారు. గడువు దాటిన తర్వాత సమర్పించిన ప్రపోజల్స్ కు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేశారు.