కవితను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజేపి వాళ్ల కాళ్లావేళ్లా పడుతున్నారు

డిల్లీలో బీజేపీ కోటలు బద్ధలు కొడుతాను అని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ , లిక్కర్ స్కాంలో ఇరుకున్న కుతురు కవితను కాపాడేందుకు డిల్లీలో బీజేపీ నాయకుల కాళ్ల మీద పడి బ్రతిమిలాడుతున్నారని తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.

Update: 2022-10-20 14:36 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డిల్లీలో బీజేపీ కోటలు బద్ధలు కొడుతాను అని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ , లిక్కర్ స్కాంలో ఇరుకున్న కుతురు కవితను కాపాడేందుకు డిల్లీలో బీజేపీ నాయకుల కాళ్ల మీద పడి బ్రతిమిలాడుతున్నారని తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధిచౌక్ లో భారీ బహిరంగ సభ గురువారం జరిగింది. ఈ సంధర్బంగా వైఎస్ షర్మిల నిజామాబాద్ జిల్లా ఓటర్లకు ధన్యవాదలు తెలిపారు. జిల్లా ప్రజలకు పసుపు బోర్డు తెస్తానని హమీ ఇచ్చి విస్మరించినందుకు సీఎం కూతురు కవితను ఓడించి ప్రపంచానికి గొప్ప తిర్పునిచ్చారని అన్నారు.

సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల కాలంలో నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఒక్క హమీని నెరవేర్చేలేదని అన్నారు. సీఎం కేసిఆర్ కేవలం ఎన్నికల సమయంలో బయటకు వచ్చి ప్రజలకు తీరని హమీలను ఇస్తాడని అన్నారు. గతంలో స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి నేడు విమానాలను కొనుగోలు చేసే స్థాయికి ఎదగడం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడానికి ఇదే నిదర్శనం అన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంను నాలుగు లక్షల కోట్ల అప్పుల వరకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 70 వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్న కేసీఆర్ ఆ డబ్బులతో మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యేగా గెలిచేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మద్యం, డబ్బులు ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే వైఎస్సార్ కి చాలా ఇష్టమని, నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు మరమత్తులు చేయించి 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని, గుత్ప, అలీ సాగర్ ప్రాజెక్ట్ ల ద్వారా 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు. ప్రాణహిత - చేవెళ్ల ద్వారా మరో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అనుకున్నారు.తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారన్నారు. ప్రతి నియోజక వర్గంలో విద్యాసంస్థలు నెలకొల్పారన్నారు. నందిపేట సెజ్ వైఎస్సార్ తీసుకు వచ్చారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం చేసేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారని, పసుపు పరిశోధన కేంద్రం, శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త కాదు భూముల గణేష్ గుప్తా అని విమర్శించారు. పంచాయతీ చేయమని చెప్తే ఆ భూమి మొత్తం స్వాహా చేయడమే ఎమ్మెల్యే పని అని ఆరోపించారు. ఖాళీ జాగా కనిపిస్తే జెండా పాతెయ్యడమే నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిగాల విధి నిర్వహణలో భాగమైందని ఘాటుగా విమర్శించారు. కమీషన్లు లేకుండా ఏ పని చేయడట కదా, అర్బన్ ఎమ్మెల్యే స్వీట్ బాయ్ అని పిలిపించుకుంటడట, అలా చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా అని షర్మిల అన్నారు. ఇక ఎంపీ అరవింద్ చేసింది ఏంటని ప్రశ్నించారు.

బాండ్ పేపర్ రాసి ఇస్తే నమ్మి ఓటేస్తే తెచ్చిండా పసుపు బోర్డ్ అని అరవిందుపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అందరూ మోసగాళ్లు అని షర్మిల విమర్శించారు. ఈ నిజామాబాద్ బిడ్డలు గట్టోల్లు అని, దొర బిడ్డ అయినా దొర సాని అయినా...మాట తప్పితే కర్రు కాల్చి వాత పెడతాం అని నిరూపించారు. ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వాళ్ళు ఈ నిజామాబాద్ బిడ్డలు అని కొని యాడారు. కేసీఆర్ బిడ్డను సైతం ఓడించారంటే మీరు సామాన్యులు కాదని షర్మిల అన్నారు. ఇప్పుడు కవితను లిక్కర్ స్కాం నుంచి తప్పించేదుకు ఢిల్లీలో వారంపాటు మకాం వేశారన్నారు.

బిడ్డ ఇక్కడ ఓడిపోయింది అని అల్లాడి పోయిన కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడన్నారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ..బిడ్డకు మాత్రమే ఉద్యోగం ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ కోటలు బద్దలు కొడతాం... మెడలు వంచుత అని చెప్పిన కేసీఆర్..వారి కాళ్ళా వెళ్ళ మీద పడటం దేనికి సంకేతం అన్నారు. నియోజక వర్గంలో సమస్యలు వస్తే పట్టింపు లేదు కానీ ఓట్లు కొనుక్కొనేందుకు వెళ్ళారు. గుడి ముందు బిచ్చగాళ్లు చిళ్ళర ఏరుకోవడానికి వెళ్లినట్లు వెళ్లారని ఆక్షేపించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇప్పుడు మునుగోడును దత్తత తీసుకుంటానన్నడంలో అర్థం ఏమిటిని నిలదీశారు.

మునుగోడు ఏమైనా పాకిస్థాన్ లో ఉందా లేక, ఆఫ్గన్ లో ఉందా, పక్కా రాష్ట్రంలో ఉందా అని షర్మిల అన్నారు. అధికార పార్టీ కొత్తగా దత్తత తీసుకోవడం ఎంటి నాకు అర్థం కావడం లేదన్నారు. ఇంతకు ముందు మీకు అభివృద్ధి చేయాలని ఆలోచన ఎందుకు రాలేదన్నారు. మీరు అధికారంలో ఉన్నారు. మునుగోడు అభివృద్ధి చేయాలని అనిపించలేదా మునుగోడుపై ఎన్నిక వస్తుంది కాబట్టే దత్తత మాట మళ్ళీ తెరపైకి వచ్చిందని విమర్శించారు.

దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందా అధికారంలో ఉన్నారు కదా మరి ఎందుకు అభివృద్ధి చేయలేదని, గతంలో దత్తత తీసుకున్న కొడంగల్ పరిస్థితి ఎలా ఉందన్నారు. ఇప్పుడు మునుగోడు దత్తత తీసుకుంటే ఏమవుతుంది. ఇంత మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు పోవాల్సిన అవసరం ఎందుకు అని ప్రశ్నించారు. ఈ బహిరంగసభ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న, బుస్సాపూర్ శంకర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News