సమాజం పట్ల యువత బాధ్యతతో ఉండాలి: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

సమాజం పట్ల యువత బాధ్యతగా ఉండాలని, పల్లెల్లో వసతులపై విశ్లేషణ చేయడం ఇతరులకు చెప్పడం గొప్ప విషయం పాఠశాల ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-01-11 03:38 GMT

దిశ, ఆర్మూర్: సమాజం పట్ల యువత బాధ్యతగా ఉండాలని, పల్లెల్లో వసతులపై విశ్లేషణ చేయడం ఇతరులకు చెప్పడం గొప్ప విషయం పాఠశాల ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో వేదం తపోవన్ రెసిడెన్షియల్ హైస్కూల్ కథగాన్, బైంసా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన "గ్రామ దర్శిని"అనే కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులకు పల్లెలో వసతులపై విశ్లేషణ చేయడం వాటిని అధికారులకు తెలియజేయడం సమాజం పట్ల బాధ్యతతో ఉండాలన్నారు. ఇతరులకు చెప్పడం గొప్ప విషయం అని వేదం పాఠశాల ఉపాద్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల పాఠశాల యాజమాన్య ప్రతినిధులు అభినందనలు తెలిపి వారి పనితీరును ఎమ్మెల్యే పైడి మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


Similar News