కండ్లుండి చూడలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు..

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... పోతంగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Update: 2023-03-22 11:02 GMT

దిశ, కోటగిరి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... పోతంగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షులు మధుసూదన్ మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గత ఏడాదిలో అకాల వర్షాలతో ఎనిమిది వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినా బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదన్నారు.

అలాగే ఇటీవల పడిన అకాల వర్షాలతో సుంకిని గ్రామంలో నేలకొరిగిన పంటలు కూడా కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు కండ్లుండి చూడలేని స్థితిలో ఉన్నారని ఎధ్దేవా చేశారు. రాబోయే ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో గెలుపొంది. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంధపు రాజు, బాన్సువాడ కౌన్సిలర్ కాసుల రోహిత్, పుప్పాల అభిషేక్, హనుమంతు, మన్సూర్, పుల్కాంటి సాయిలు, దత్తు, రాజేందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News