జీవితంపై విరక్తిచెంది వ్యక్తి ఆత్మహత్య

జీతంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-11-23 15:41 GMT

దిశ గాంధారి/సదాశివనగర్: జీతంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. సదాశివ నగర్ ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం..వడ్లు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తాండ లింగం (45) తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా..అందులో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధపడుతూ..జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులో  ఉరివేసుకొని మరణించాడని తెలిపారు. మృతుడు తాడ్వాయి తహసిల్దార్ ఆఫీస్ లో అటెండర్ గా విధులు నిర్వహించేవాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.


Similar News