నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం..

Update: 2023-11-27 09:57 GMT

దిశ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ ఎల్లారెడ్డి పట్టణంలోని పలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోచారం డ్యాం ఆయకట్టు లోతును పెంచుతామని, పోచారం ఆయకట్టు నీరు చివరి డిష్టిబ్యుటర్ వరకు నీరు అందే విధంగా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు, ఉపాధి కల్పన జరిగే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభవృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో త్వరగా బస్ డిపో నిర్మాణం నిర్మించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News