వావ్..పెంపుడు నక్క

అడవిలో సంచరించాల్సిన నక్క ఎల్లారెడ్డి పట్టణంలోని 2 వార్డ్ గాంధీ నగర్ లో తిరుగుతుంది.

Update: 2024-10-24 14:46 GMT

దిశ ఎల్లారెడ్డి : అడవిలో సంచరించాల్సిన నక్క ఎల్లారెడ్డి పట్టణంలోని 2 వార్డ్ గాంధీ నగర్ లో తిరుగుతుంది. గురువారం ఉదయం పని మీద వెళుతున్న ఓ వ్యక్తికి కనిపించగా..నక్క గురించి ఆరా తీశాడు. నక్క గత నాలుగు నెలలుగా, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడే తమ మధ్యనే రోజు సంచరిస్తుందని, దాని బాగోగులు జంగం రాజు అనే వ్యక్తి చూసుకుంటారని స్థానికులు తెలిపారు.జంగం రాజు ఎక్కువగా కుక్కలను చేరదీస్తాడని, అతని ఇంటిలో ఎప్పటికీ కుక్కలు అతనితోనే ఉంతాయన్నారు. గాంధీనగర్ వైపు వచ్చిన నక్కను కూడా నాలుగు నెలల నుంచి కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. దానికి కావాల్సిన ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తున్నదని తెలిపారు.


Similar News