సిద్ధ రామేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి
చరిత్ర కలిగిన సిద్ధ రామేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు.
దిశ, భిక్కనూరు : చరిత్ర కలిగిన సిద్ధ రామేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ముందుగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ములతిర్మల్ రెడ్డితో కలిసి భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు దేవుని ప్రసాదం అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆలయ విశిష్టతను ప్రాముఖ్యతను వివరించగా అంతా తెలుసని, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో మీరే చూస్తారని స్పష్టం చేసినట్లు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రెడ్డి ఐక్యవేదిక ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేయగా, వారి సమస్యల పరిష్కారానికి కూడా సానుకూలంగా స్పందించినట్లు ఐక్యవేదిక ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారు శేరి సుభాష్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.