గ్రామపంచాయతీకి తాళం వేసి ఖాళీ బిందెలతో మహిళల నిరసన
నల్లా నీళ్లు సరఫరా చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఖాళీ బిందెలతో ప్రదర్శన చేసి నిరసన తెలిపిన ఘటన కామారెడ్డి జిల్లా నాచారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ, మాచారెడ్డి: నల్లా నీళ్లు సరఫరా చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఖాళీ బిందెలతో ప్రదర్శన చేసి నిరసన తెలిపిన ఘటన కామారెడ్డి జిల్లా నాచారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ నీరు సరఫరా కాలేదు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది పై మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ నీరు సరఫరా కానప్పుడు గ్రామంలోని బోరు బావుల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వైఖరిపై గ్రామ మహిళలు మండిపడ్డారు. దీంతో వారు గ్రామ పంచాయతీ ఖాళీ బిందెలతో వచ్చి నిరసన తెలిపి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిలదీశారు. మధ్యాహ్నం వరకు తాగునీటి సరఫరా చేస్తామని గ్రామ సర్పంచ్ అంబటి లలిత నారాయణ సర్ది చెప్పారు. గ్రామంలో మంచి చెడు పట్టించుకునే నాధుడే కరువాయాడని నిరసన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.