దశాబ్ది ఉత్సవాల్లో నగదు బహూకరణకు మొండి చెయ్యేనా..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడంలో కొద్దిగా జోష్ తగ్గిందా అనడంలో తగ్గిందని చెప్పవచ్చు ఎందుకంటే మొదటి అవతరణ దినోత్సవం వివిధ విభాగాలలో ప్రశంసా పత్రం తో పాటు నగదు బహుకరణ చేశారు.

Update: 2023-06-01 05:13 GMT

దిశ, గాంధారి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడంలో కొద్దిగా జోష్ తగ్గిందా అనడంలో తగ్గిందని చెప్పవచ్చు ఎందుకంటే మొదటి అవతరణ దినోత్సవం వివిధ విభాగాలలో ప్రశంసా పత్రం తో పాటు నగదు బహుకరణ చేశారు. కానీ ఇప్పటివరకు దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో శతాబ్ది ఉత్సవాలకు నాంది పలకడంతో మొదట్లో అమలుపరిచిన అవతరణ దినోత్సవంలో ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా నగదు పురస్కారం అందజేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిపింది.

అందులో సాహితీ, కవి, రచయిత వివిధ రంగాల్లో సేవలందించిన ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రం తో పాటు రూ.10,116 నగదును బహుకరిస్తూ.. 2015 సంవత్సరంలో మొదటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ శతాబ్ది వేడుకలనైన వివిధ విభాగాలకు నగదు పురస్కారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మార్వో ను, ఎంపీపీని వివరణ కోరగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ రెండో తారీకు నుంచి 22 తారీకు వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా జరుగుతాయని 11 జూన్ నాడు కవులు సాహిత్య కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు అంతేకానీ నగదు పురస్కారాలు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియదని తెలిపారు.

Tags:    

Similar News