ఆర్మూర్‌లో రంజుగా మున్సిపల్ రాజకీయం.. అవిశ్వాసం వీగేనా... నెగ్గేనా...?

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై

Update: 2024-01-01 15:04 GMT

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్ష ఈ నెల 4న జరగనుంది.మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతును కూడా గడుతూ క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో ఆర్మూర్ మున్సిపల్ రాజకీయం రంజుగా తయారయింది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో, అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సహకారంతో పండిత్ వినీత పవన్ చేపట్టిన విషయం తెలిసిందే. కానీ ఆర్మూర్ మున్సిపల్ బీఆర్ఎస్ స్వపక్షంలోనే విపక్షం తయారై గత ఏడాది డిసెంబర్ 12న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 24 మంది కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాసం పెట్టాలని సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్ల వినతి పత్రాన్ని పరిశీలించి, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ల బలాబలాలను తెలుసుకొని ఈనెల 4వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ తేదీని నిర్ణయించారు.

మున్సిపల్ కమిషనర్ చేత మున్సిపల్ కౌన్సిలర్లకు అవిశ్వాస తీర్మాన సమావేశ నోటీసులను అంద జేయించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ తేదీని ఖరారు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కాలం ఇంకా 13 నెలలు మిగిలి ఉంది.దీంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాందేశ్ సంగీత శ్రీనివాస్, అయ్యప్ప వన్నెల దేవి లావణ్య శ్రీనివాస్ లు మున్సిపల్ చైర్ పర్సన్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో దృఢ సంకల్పంతో రెట్టించిన ఉత్సహంతో ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా నెగ్గాలనే దృఢ సంకల్పంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచన మేరకు చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్న ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు ఒక్కటై కౌన్సిలర్ల మద్దతును కూడా గడుతూ మున్సిపల్ కౌన్సిలర్లతో క్యాంపు శిబిరాలకు తెర లేపారు.

క్యాంపు శిబిర్యాలకు తరలిన ఇరువర్గాల మున్సిపల్ కౌన్సిలర్లు...

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రవేశ పెట్టినందున ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ వర్గంతో పాటు వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు క్యాంపు శిబిరాలకు తరలి వెళ్లారు. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు గతంలోనే ఇచ్చిన విషయం తెలిసిందే.కౌన్సిల్ లోని మెజారిటీ సభ్యులు అవిశ్వాసాన్ని ప్రతి పాదించినందున జిల్లా కలెక్టర్ ఈనెల 4న అవిశ్వాసం పై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మున్సిపల్ చైర్ పర్సన్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొదట క్యాంపు శిబిరానికి తరలి వెళ్లారు. అదే విధంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం క్యాంపు శిబిరానికి తరలి వెళ్లారు. ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

వీరిలో కొందరు చైర్ పర్సన్ శిబిరంలో 8 మంది కౌన్సిలర్లు ఉండగా, మరి కొందరు వ్యతిరేక వర్గం మున్సిపల్ సుమారు 20 కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించిన క్యాంపు శిబిరంలో ఉండగా, మరో ఇద్దరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన సమావేశం రోజు నేను మా నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నట్లు తెలుస్తుంది.ఇరు వర్గాల వారు క్యాంప్ శిబిరాలను నిర్వహిస్తూ తమకు మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నట్లు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ శిబిరాలతో పాటు ఆర్మూర్ లోనే ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతు అవిశ్వాసాన్ని గట్టెక్కిస్తుందా, వీగిపోయేలా చేస్తుందా అనే విషయాన్ని ఆర్మూర్ పట్టణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇస్తారా, అవిశ్వాసం వీగిపోయేందుకు సమావేశానికి గైర్హాజరు అవుతారా అనే విషయం ఆర్మూర్ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ఏది ఏమైనా కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం విగేనా... నెగ్గేనా అనే విషయం ఈనెల 4వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరగబోయే మున్సిపల్ అవిశ్వాస తీర్మాన సమావేశంలో తేటతెల్లం కానుంది.

Similar News