ఆర్మూర్ బల్దియా చైర్ పర్సన్ పదవి ఎవరిని వరించేనో....!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రమైన ఆర్మూర్ మున్సిపల్‌లో నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలతో పాటు, నిజామాబాద్ జిల్లా ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Update: 2024-01-08 11:04 GMT

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రమైన ఆర్మూర్ మున్సిపల్‌లో నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలతో పాటు, నిజామాబాద్ జిల్లా ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్వహించిన ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని పండిత్ వినీత దక్కించుకున్నారు.

సుమారు ఏడాది క్రితం మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్‌ను మార్చేందుకు కూటమి ఏర్పడి అప్పట్లోనే అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని, కలువగా, జీవన్ రెడ్డి తిరస్కరించడంతో తిరిగి కౌన్సిలర్ అంతా ఆర్మూర్‌కు వచ్చి మేమంతా కలిసే ఉన్నాం.. మున్సిపల్ చైర్ పర్సన్‌తో కలిసి ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఏడాది కిందట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మారిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందని అప్పట్లో జీవన్ రెడ్డి భావించి ఉంటాడని ఆర్మూర్లో అందరూ మాట్లాడుకున్నారు.

గత నాలుగేళ్లుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా పండిత్ వినీత కొనసాగారు. కానీ గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆశన్నగారి జీవన్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారం మళ్లీ పట్టాలపైకి రావడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారన్న సమాచారంతో మున్సిపల్ కౌన్సిలర్ లందరిని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని మెజార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

గత ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో అధికార పక్షంలోనే విపక్షం తయారై బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా ఇటీవల ఈ నూతన ఏడాదిలో అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిట్ వినీత పై మున్సిపల్ అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు , బీజేపీ పార్టీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టించి, నెగ్గించుకోవడంతో ఆర్మూర్ మున్సిపల్ పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మార్క్ కొట్టొచ్చినట్లు కనపడిందని, మున్సిపల్ చైర్ పర్సన్ పండి వినీతను పదవీచ్చుతురాలిని చేయడంలో సఫలీకృతుడైనట్లు ఆర్మూర్‌లో జనం చర్చించుకుంటున్నారు.



ఆర్మూర్లో బీఆర్ఎస్‌కు, బీజేపీ మద్దతుపై సోషల్ మీడియాలో పోస్టుల వైరల్...

ఈనెల 4వ తేదీన ఉత్కంఠగా జరిగిన ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస సమావేశంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన విశ్వాస సమావేశానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనంటూ రాజకీయాల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టాయంటూ సోషల్ మీడియాలో ఆర్మూర్ ప్రజలు పెడుతున్న పోస్టులు జోరుగా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ విశ్వాస తీర్మాన సమావేశం అనంతరం.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్లో మొదటి వికెట్ పడిందని, ఇప్పుడు ఆర్మూర్ మున్సిపల్‌లో రెండో వికెట్ పడిందని ఆర్మూర్ ప్రజలు కోరుకున్నట్లుగా అవినీతి పాలన అంతం అందించేందుకే ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరైనట్లు చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ పై కాషాయపు జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడటం సరే కానీ.. ఆర్మూర్ మున్సిపల్‌లో బీజేపీ మున్సిపల్ బలం 5 గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. అయిదుగురు కౌన్సిలర్లతో మున్సిపల్‌లో కాషాయ జెండా ఎగురవేయడం అసాధ్యమని ఆర్మూర్ లోని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా గత నాలుగేళ్లు కొనసాగిన పండిత్ వినీతను పదవి నుంచి దించేందుకు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీ పార్టీలో చేరితేనే ఆర్మూర్ మున్సిపల్‌లో కాషాయ జెండా ఎగరవేయడం సాధ్యమవుతుందని ఆర్మూర్‌లోని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మళ్లీ ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని ఎవరిని వరించనుందోననే ఆసక్తి ఆర్మూర్ పుర ప్రజల్లో ఉత్కంఠతను రేపుతుంది.

చైర్ పర్సన్ పదవి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య గట్టి పోటీ... ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కౌన్సిలర్ల భర్తలు...

ఆర్మూర్ మున్సిపల్‌లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యప్ప వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, ఖాందేశ్ సంగీత శ్రీనివాస్‌లు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకునేందుకు గట్టిగా పోటీ పడుతున్నారు. గత నాలుగేళ్ల క్రితం సైతం ఇరువురు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఈ దఫా ఈ 13 నెలల మున్సిపల్ పదవీ కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో వారి సతీమణులను అందలం ఎక్కించేందుకు వారి భర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖాందేష్ సంగీత శ్రీనివాస్, అయ్యప్ప వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్‌లు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ఆర్మూర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అనుభవజ్ఞులు రాధిక, విధేయురాలిక ఇద్దరి మధ్యలో ఎవరికి మొగ్గు చూపనున్నాడోనని ఆర్మూర్ మున్సిపల్ జనం ఆసక్తిగా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది ఉండగా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్ గా నమోదు చేసుకోవడంతో సంఖ్య బలం 37 పెరిగింది. అయినా కూడా ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అసమ్మతి మున్సిపల్ కౌన్సిలర్ల బృందం దగ్గర 20 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా, వీరి సంఖ్య బలంతో సునాయాసంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోనుంది.


Similar News