నిజాంసాగర్ ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా నీటి విడుదల..

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా దిగువకు 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు.

Update: 2024-09-23 17:32 GMT

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా దిగువకు 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 3,000 వేల ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతుందని, అలాగే సింగూరు ప్రాజెక్టు ద్వారా రాత్రి వరకు 10 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని తెలిపారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1405.00 అడుగులు 17.802 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తివేసి 8,000 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి, ప్రధాన కాలువ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నట్లు, ఏఈఈ తెలిపారు. అదేవిధంగా వాగులు, వంకలు, కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు మంజీరా వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.


Similar News