నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే వాగులు దాటవద్దు.. అదనపు కలెక్టర్
వాగుల ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట గ్రామప్రజలు వాగులు దాటవద్దని కామారెడ్డి అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
దిశ, మద్నూర్ : వాగుల ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట గ్రామప్రజలు వాగులు దాటవద్దని కామారెడ్డి అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం గోజేగావ్ గ్రామం వద్ద గల లెండి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. వాగు పరిస్థితులు, వంతెన స్థితిగతులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా లెండి వాగును మండల తహశీల్దార్, ఎంపీడీఓతో కలిసి పరిశీలించారు.
సోమవారం వాగు పై నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంగళవారం వాగును పరిశీలించారు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉంటే గ్రామస్తులు వాగులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మద్నూర్ మండల తహశీల్దార్ ఎండి.ముజీబ్, ఎంపీడీఓ రాణి, ఎంపీఓ నర్సయ్య, గిర్దావర్ శంకర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.