నగరంలో పట్టపగలే మరో చోరీ
నిజామాబాద్ నగరంలో కొద్ది రోజులుగా తరచూ చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 28: నిజామాబాద్ నగరంలో కొద్ది రోజులుగా తరచూ చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటికి తాళం వేసి వెళితే తిరిగి వచ్చే సరికి ఇల్లు భద్రంగా ఉంటుందో లేదోనని ప్రజలు వాపోతున్నారు. తాజాగా గురువారం పట్టపగలే నగరంలో మరో చోరీ జరిగింది. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. సంజీవ్‌రెడ్డి కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి బంగారం,నగదును ఎత్తుకెళ్లారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబీకులు హోమ కార్యక్రమం చేయించడానికి ఇంటికి తాళం వేసి..ఆలయానికి వెళ్లారు. గుడిలో హోమం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో దాచుకున్న ఆరు తులాల బంగారం వస్తువులు, రూ.6 వేల నగదు పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో ఫుటేజీల ఆధారంగా ఎస్ఐ శ్రీకాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నగరంలో పట్టపగలే మరో చోరీ