నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు

మండలం లోని పోలీస్ స్టేషన్ ఎస్సైగా వి.వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..

Update: 2024-02-19 14:49 GMT

దిశ, తాడ్వాయి: మండలం లోని పోలీస్ స్టేషన్ ఎస్సైగా వి.వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ...మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై ఆంజనేయులు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు.


Similar News