వీలిన కోటార్మూర్ హామీలు అటకేక్కెన్..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గత మున్సిపల్ ఎన్నికలకు సంవత్సరం ముందు 2018లో ఆర్మూర్ మున్సిపల్ లో మామిడిపల్లి, పెర్కిట్, కోటార్ మూర్ గ్రామాలు వీలీనమయ్యాయి
దిశ, ఆర్మూర్ :నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గత మున్సిపల్ ఎన్నికలకు సంవత్సరం ముందు 2018లో ఆర్మూర్ మున్సిపల్ లో మామిడిపల్లి, పెర్కిట్, కోటార్ మూర్ గ్రామాలు వీలీనమయ్యాయి. మేజర్ గా పెరికిట్-కోటార్ మూర్ ఉమ్మడి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,మామిడిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆర్మూర్ మున్సిపల్ లో విలీనం అయ్యేందుకు అంగీకరించలేదు, పైగా ఆర్మూర్ మున్సిపల్ లో వీలీనానికి వ్యతిరేకంగా గ్రామపంచాయతీలు తీర్మానాలు చేశాయి. పెర్కిట్ కోటార్ముర్ గ్రామపంచాయతీ అప్పటి సర్పంచ్ లక్కారం విజయలక్ష్మి నారాయణ, ఆర్మూర్ వైస్ ఎంపీపీ ఇట్టేడి బాజన్న లతో పాటు..ఇతర ప్రజా ప్రతినిధులు సైతం వీలైనానికి వ్యతిరేకించారు. కానీ అప్పటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ ల ప్రక్కన గల గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదల చేశారు. దీంతో ఇష్టం లేకుండా ఈ వీలిన గ్రామాల ప్రజలు ఆర్మూర్ మున్సిపల్ లో వీలీనమయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ లో విలీనం కాగానే విలీనం గ్రామాల మున్సిపల్ పన్నులు కొద్దిగా పెరిగాయి. మున్సిపల్ లో కలిసాము కదా పనులు అభివృద్ధి జరుగుతాయని ప్రజలు ఆశించారు. పైగా ఆర్మూర్ మున్సిపల్ లో విలీనమైన గ్రామాల అభివృద్ధి కోసం అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి 20 కోట్ల నిధులను మంజూరు చేయించారు. 20 కోట్ల నిధులతో విలీన గ్రామాల్లోని ప్రధాన రహదారుల వెంట డివైడర్లతో రోడ్ల సుందరీ కరణ,సెంట్రల్ లైటింగ్, మిగతా రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తామని అప్పట్లో నాయకులు హామీలు ఇచ్చారు.
ఆర్మూర్ మున్సిపల్ లో విలీనమైన పెర్కిట్ మామిడిపల్లి ఏరియాల్లో ప్రధాన రహదారి వెంట డివైడర్ సుందరీకరణ పనులు అధికారులు చేపట్టారు. కానీ మరో వీలిన గ్రామమైన కోటార్మూర్ గ్రామంలో డివైడర్ సుందరీకరణ పనులు ఇప్పటివరకు ప్రారంభించిన నాధుడే లేదు. పైగా ఆ రోడ్డు వెంట సెంట్రల్ లైటింగ్ కూడా లేకపోవడంతో..రోడ్డు మధ్యలో పెట్టిన చెట్లతో రాత్రి సమయాల్లో వెలుతురు లేమితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కోటార్ మూర్ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో ప్రధాన రహదారి ఉదయం,రాత్రి వేళల్లో వాకింగ్ చేసే పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రోడ్ల వెంబట వెల్తురు సైతం లేకపోవడంతో తరచూ వాకింగ్ చేసే ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇప్పటికైనా విలీన గ్రామమైన కోటార్ మూర్లో అటకెక్కిన 63వ నంబర్ జాతీయ రహదారి డివైడర్ సుందరీ కరణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
-కోటార్ మూర్ స్మశానవాటిక వైకుంఠధామానికి సైతం నోచుకోలే..
ఆర్మూర్ మున్సిపల్ వీలిన గ్రామమైన కొటార్మూర్ స్మశాన వాటిక వైకుంఠ ధామ నిర్మాణానికి నోచుకోలేదు. గత బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు జన్మించిన దగ్గర నుంచి తను చాలించే వరకు అన్ని వసతులు కల్పించాలన్న బృహత్తర ఆలోచనతో స్మశాన వాటికల్లో సైతం సుందరీకరణ పనులు చేపడుతూ వైకుంఠధామాలను అద్భుతంగా నిర్మించారు. అదే తరహాలో కోటార్ ముర్ స్మశాన వాటికలో సైతం వైకుంఠధామ నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. కానీ కోటార్ మూర్ ఏరియాలోని ప్రస్తుత ప్రజాప్రతినిధుల కమిషన్ల లొల్లితో ఆ పనులు ముందుకు సాగలేనట్లు కొటార్ మూర్లో ప్రజలు జోరుగా చర్చించు కుంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ తో పాటు చుట్టుప్రక్కల అన్ని గ్రామాల్లో స్మశానవాటికల్లో వైకుంఠధామాలు అద్భుతంగా ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరగడంతో కోటార్మూరు వాస్తవ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల వికృత శ్రేష్ఠలతో కోపోద్రక్తులు అయినట్లు విశ్వసనీయ సమాచారం. కోటారము ఏరియా ప్రజలందరికీ ఉపయోగపడే స్మశాన వాటిక లోని వైకుంఠధామం నిర్మాణ పనులు ప్రజాప్రతినిధుల కమిషన్ల లొల్లితో ఆగి నిధులు తరలిపోవడంతో..కోటార్ మూర్ వాస్తవ్యులు ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నట్లు తెలిసింది. విలీన గ్రామమైన కోటామూర్లో ఏ పదిమంది కలిసిన ఈ చర్చ గత కొన్ని సంవత్సరాలుగా జరగడం చర్చనీయాంశమైంది. వచ్చే సంవత్సరంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కోటార్మూర్ వాస్తవ్యులు ఏ మేరకు వారి విలక్షణ ఓటర్ తీర్పును ఇవ్వనున్నారో చూడాల్సిందే మరి..