Urban MLA : లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారికి ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Update: 2024-07-22 11:16 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారికి ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, ధన్ పాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 44 మందికి రూ.11.94 లక్షలు వచ్చాయన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ఫైరవీరులు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి ఇచ్చామన్నారు. ఈ సాయం కోసం అవసరమైన అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి, ముఖ్య మంత్రి సహాయనిధి అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందన్నారు.

నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. లబ్దిదారులకు భారం కాకుండా చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుసుకున్న నెలలోపు సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్దిదారులకు అప్లై చేసుకున్న మొత్తంలో 50 శాతం నిధుల సాయం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News