నిలకడగా కౌలాస్ నాలా ప్రాజెక్టు
కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రశాంతంగా ఉందని ప్రాజెక్ట్ ఏఈ రవిశంకర్ తెలిపారు
దిశ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రశాంతంగా ఉందని ప్రాజెక్ట్ ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 458 మీటర్లు ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ 1.237 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 1.237 టీఎంసీలు నీరు నిలువ ఉందని తెలిపారు. ప్రస్తుతం కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నిలకడగా ఉందని ప్రాజెక్ట్ ఏఈ రవిశంకర్ అన్నారు. ప్రధాన కెనాల్ తో 100 క్యూసెక్కుల నీటిని పంట భూములకు విడుదల చేశామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి 678 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతుందన్నారు.