మా పోరాటానికి ఫలితం లభించింది: 1995 యాక్ట్ రద్దు కమిటీ సెక్రటరీ లింగారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల 1995 యాక్ట్ రద్దు కమిటీ రాష్ట్ర కార్యదర్శి దేగం ఇట్టేడి లింగారెడ్డి సోమవారం హర్షం వ్యక్తం చేశారు.
దిశ, ఆర్మూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల 1995 యాక్ట్ రద్దు కమిటీ రాష్ట్ర కార్యదర్శి దేగం ఇట్టేడి లింగారెడ్డి సోమవారం హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీ చేసేందుకు అనర్హులు అంటూ 1995లో అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, ఆ చట్టాన్ని తొలగించేందుకు కొన్నేళ్ల నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్‌లను గాంధీ నాయక్ ఆధ్వర్యంలో కలిసినట్లుగా లింగారెడ్డి తెలిపారు. ఎట్టకేలకు 1995 యాక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సడలించిందని, ఇన్నేళ్లు తాము చేసిన పోరాటానికి ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎంకు లింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.