సాహివాల్ జాతి పిండాలను దేశి ఆవులకు మార్పిడి
తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మంగళవారం పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
దిశ, తాడ్వాయి : మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మంగళవారం పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా పశు వైద్య అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ..మాస్ ఎంబ్రియో ట్రాన్సఫర్ టెక్నాలజీ పద్ధతి ఆధారంగా అధిక పాలను ఉత్పత్తి చేసే సాహివల్ జాతి పిండాలను దేశి ఆవుల గర్భికోశంలోకి ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. మాస్ ఎంబ్రియో ట్రాన్సఫర్ టెక్నాలజీతో తక్కువ మోతాదులో పాలను ఇచ్చే దేశి ఆవులకు ఈ పద్ధతితో నాణ్యమైన దూడలను పొందవచ్చని ఆయన అన్నారు. దీంతో పాడి రైతులకు అధికంగా పాల దిగుబడి పెరగడంతో పాటు.. రైతులు దినదిన అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆరు పశువులకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతితో పిండాలను మార్పిడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొపెసర్ డా. రామచంద్రారెడ్డి,డా.రమేష్, రవి,కిరణ్,డా.శ్రావిక పోచయ్య, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.