సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలు చేపట్టండి

సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని బుధవారం స్కూల్ ఆఫ్ డైరెక్టర్, కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

Update: 2024-08-28 15:16 GMT

దిశ,నిజాంసాగర్ : సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని బుధవారం స్కూల్ ఆఫ్ డైరెక్టర్, కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం బాధ్యులు, సభ్యులు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈవీ నరసింహ రెడ్డికి వినతి పత్రం అందించారు. క్లియర్ వేకెన్సీ పోస్టులలో తమ సమ్మతం మేరకు ఉద్యోగ బదిలీల ప్రక్రియ చేపట్టాలని విన్నవించారు.

    దీంతో నరసింహా రెడ్డి స్పందించి కేజీబీవీ బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే సమగ్ర శిక్షలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సీఆర్పి, ఎంఐఎస్, సీసీఓ, పీటీఐ, ఐఈఆర్పీ తదితర ఉద్యోగుల బదిలీలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా కనీస వేతన చెల్లింపు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంగుల కృష్ణారెడ్డి, తిరందాస్ సంతోష్ కుమార్, బి.శ్రీధర్ కుమార్ రాధరెడ్డి, దారం నవీన్ రెడ్డి,మొగిలిచర్ల శ్రీనివాస్, రవీందర్, లలిత, కె. భాష్కర్, మర్రి రవికుమార్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News