గణేష్ ఉత్సవాల్లో దొంగల చేతివాటం

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ ఉత్సవాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.

Update: 2024-09-07 09:28 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ ఉత్సవాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గణేష్ విగ్రహ తయారీ దారుల నుంచి గణనాథులను తరలించే ప్రక్రియలో పలువురు యువకుల ఫోన్లను దొంగలు మాయం చేశారు. గణేష్ ఉత్సవాల సంబరాల్లో వినాయకులను తరలించే మోజులో ఉన్న యువకుల జేబులోంచి వారికి తెలియకుండానే గుర్తు తెలియని దుండగులు ఫోన్లను చోరీ చేశారు.

     సుమారు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పెర్కిట్, కోటార్ మోర్ జాతీయ రహదారిలో విగ్రహాల తయారీదారుల నుంచి గణనాథులను తరలించే క్రమంలో దొంగలు యువకుల వద్ద నుంచి సుమారు 10 నుంచి 15 ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. కాగా వీరిలోంచి పది మంది యువకుల వరకు ఆర్మూర్ పోలీసులకు వారి ఫోన్లో చోరీ విషయమై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

Tags:    

Similar News