Breaking: కామారెడ్డిలో ఉద్రిక్తత..రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి పోలీసుల వార్నింగ్

కామారెడ్డిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతరులు నియోజవకర్గాలను వదిలి వెళ్లాలన్న ఈసీ ఆంక్షలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని కామారెడ్డి మండలం దేవులపల్లి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు..

Update: 2023-11-28 19:11 GMT

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతరులు నియోజవకర్గాలను వదిలి వెళ్లాలన్న ఈసీ ఆంక్షలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని కామారెడ్డి మండలం దేవులపల్లి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. కొండల్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనతో చర్చించారు. అయితే తాను 15 రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉంటున్నానని, కాంగ్రెస్ తరపున చీఫ్ ఏజెంట్‌గా ఉన్నానని పోలీసులకు కొండల్ రెడ్డి ఐడీ కార్డును చూపించారు. కానీ పోలీసులు మాత్రం కొండల్ రెడ్డి ఉంటున్న నివాసం చుట్టూ భారీగా మోహరించారు.

మరోవైపు ప్రైవేటు వాహనాల్లో పోలీసులు రావడాన్ని కొండల్ రెడ్డి తప్పుపట్టారు. పోలీసులకు ప్రభుత్వం వాహనాలు ఇచ్చింది ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేటు వాహనాలతో రావడం పట్ల  ప్రాణానికి అపాయం  ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని కొండల్ రెడ్డి పేర్కొన్నారు. 


Similar News