రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

Update: 2024-11-09 14:49 GMT

దిశ, భిక్కనూరు : రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తాటిపత్రులు, ప్యాడి క్లియర్ యంత్రాలు, తేమ శాతాన్ని గుర్తించే పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలని పిలుపునిచ్చారు. సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్కనూరు, బీబీపేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపారి భీమ్ రెడ్డి, సుతారి రమేష్, సొసైటీ చైర్మన్లు గంగల భూమయ్య, గోండ్ల సిద్ధ రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బల్యాల రేఖ సుదర్శన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, వైస్ చైర్మన్ పాపనోళ్ల స్వామి, డైరెక్టర్లు కొడిప్యాక వెంకటేశం,నాగర్తి రమేష్ రెడ్డి,దిలీప్, అమర్, మాజీ ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పి నర్సింహారెడ్డి, నాగర్తి నరేందర్ రెడ్డి, అంకం రాజు, లింగాల కిష్టా గౌడ్, శ్రీరామ్ వెంకటేష్, మద్దూరి రవి, మహమ్మద్ సాజిద్, తాటిపాముల సిద్దా గౌడ్, కోటన్ స్వామి, మద్దూరి రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News