దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రం నడిబొడ్డున నాలుగు ఆటో మొబైల్స్ దుకాణాల్లో దుండగులుదిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రం నడిబొడ్డున నాలుగు ఆటో మొబైల్స్ దుకాణాల్లో దుండగులుదిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రం నడిబొడ్డున నాలుగు ఆటో మొబైల్స్ దుకాణాల్లో దుండగులుచోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు షటర్లు ఓపెన్ చేసి ఉండటంతో దుకాణం యజమానులకు సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన దుకాణాల వద్దకు చేరుకుని చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తాకు పక్కనే ఎప్పుడు రద్దీగా ఉండే రష్ హాస్పిటల్ పక్కన గల నాలుగు దుకాణాల్లో ఈ చోరీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రం నడిబొడ్డున కావడంతో పాటు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే చోరీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. రష్ ఆస్పత్రి పక్కన ఉన్న శ్రీ బాలాజీ ఆటో మొబైల్స్, శ్రీ సాయి ఆటో వర్క్స్, భగవాన్ ఆటో మొబైల్స్, లక్ష్మీ గణపతి ల్యూబ్ ఆయిల్ సెంటర్లలో ఈ చోరీ చోటుచేసుకుంది. షటర్లు పగులగొట్టి గల్లపెట్టెల్లో ఉన్న నగదును దోచుకెళ్లి.. ఖాళీ గల్లపెట్టెలను షట్టర్ వెనకాల పడేసి వెళ్లిపోయారు. దుకాణాల్లో ఎంతమేర చోరీ జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. క్లూస్ టీం కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం వరకు చోరీకి సంబందించిన వివరాలు తెలియనున్నాయి.