నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ మూసివేత..ఎప్పటివరకంటే..?
నవీపేట రైల్వే గేటును ఈనెల 26 నుంచి 30 వరకు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బి. శ్రీనివాస్ తెలిపారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 25: నవీపేట రైల్వే గేటును ఈనెల 26 నుంచి 30 వరకు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బి. శ్రీనివాస్ తెలిపారు. అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున నవీపేట సవీుపంలోని 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును ఐదు రోజుల పాటు.. మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 7.00 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు రైల్వే గేటు మూసివేయబడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. నిజామాబాద్-బాసర మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మొకనపల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. ప్రయాణికులు ట్రాఫిక్ దారి మళ్లింపును పాటిస్తూ, తమ వంతు సహకారం అందించాలని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బీ.శ్రీనివాస్ కోరారు.