పోలీసుల చెకింగ్ అని బంగారం అపహరణ

మండల కేంద్రంలోని యెర్ర హన్మాండ్లు కాంప్లెక్స్ వద్ద ద్విచక్ర వాహనదారుడి నుండి గుర్తుతెలియని నలుగురు దుండగులు మంగళవారం మూడు తులాల బంగారం అపహరించినట్లు సీఐ సతీష్, ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.

Update: 2024-03-12 16:19 GMT

దిశ, నవీపేట్ : మండల కేంద్రంలోని యెర్ర హన్మాండ్లు కాంప్లెక్స్ వద్ద ద్విచక్ర వాహనదారుడి నుండి గుర్తుతెలియని నలుగురు దుండగులు మంగళవారం మూడు తులాల బంగారం అపహరించినట్లు సీఐ సతీష్, ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక లింగమయ్య గుట్ట కాలనీలో ఉంటున్న ట్రాన్స్కో రిటైర్డ్ ఉద్యోగి నర్సింహాచారి మండల కేంద్రంలో టిఫిన్ చేసి తిరుగు ప్రయాణంలో లింగమయ్య గుట్టకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ ని ఆపి ముందు పోలీసులు చెకింగ్ చేస్తున్నారని బంగారాన్ని తీసి స్కూటీలో పెట్టాలని సూచించారు.

    నరసింహాచారి మెడలోని గొలుసు, చేతిలోని ఉంగరాలను తీసి సొంత స్కూటీలో ఉంచే సమయంలో దుండగులు నకిలీ బంగారాన్ని బాధితుని స్కూటీ లో ఉంచి అసలు బంగారంను తీసుకెళ్లారు. దాంతో కొద్ది సేపటి తరువాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ సతీష్, ఎస్ఐ యాదగిరి గౌడ్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టి సీసీ టీవీ ఫుటేజీ ని పరిశీలించగా ముసుగులో వచ్చిన దుండగులు నిజామాబాద్ వైపు పారిపోయారని తెలిపారు. ఇలాంటి దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. 


Similar News