మద్యం మత్తులో 100 కు ఫోన్.. పోలీసులు ఏం చేశారంటే..
ఓ వ్యక్తి మద్యం మత్తులో 100కు డయల్ చేశాడు. దాంతో పోలీసులు అతడికి జైలు శిక్ష విధించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఉపయోగించాల్సిన డయల్ 100 ను ఓ వ్యక్తి ఆకతాయి తనంతో మధ్యం మత్తులో దుర్వినియోగం చేశాడు. అత్యవసర సాయం అవసరం లేకున్నా తాగిన మైకంలో నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్ కు చెందిన కర్కపాట్ల రాజేశ్ అనే వ్యక్తి సోమవారం డయల్ 100 కు కాల్ చేశాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా త్రీ టౌన్ ఎస్ ఐ మాట్లాడుతూ.. డయల్ 100ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని, అవసరం లేకున్నా, ఆకతాయితనంతో కాల్ చేసి న్యూసెన్స్ చేస్తే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని ఎస్ ఐ తెలిపారు.