షాపు యజమాని అనుమానమే నిజం అయింది.. ఇంతకూ ఏమైందంటే..?

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలోని జువాడి గ్రామంలో కొన్ని రోజుల క్రితం వడ్ల పండరి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు.

Update: 2024-10-19 14:06 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలోని జువాడి గ్రామంలో కొన్ని రోజుల క్రితం వడ్ల పండరి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. శనివారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. జువ్వాడి గ్రామానికి చెందిన పండరి బంధువులైన వడ్ల రాకేష్ అతని అన్న వడ్ల శ్రీకాంత్ ఇద్దరు కలిసి దొంగతనం చేసి దొంగలించిన సొత్తును మండల కేంద్రంలోని ఓం సాయి స్టీల్ షాప్ లో అమ్మడానికి ప్రయత్నించగా.. యజమాని అయినా వినయ్ కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసి నిందితుల దగ్గర నుంచి పూర్తి సొత్తును స్వాధీనం చేసుకొని.. నేరస్తులను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు ఎస్సై తెలిపారు.


Similar News