లక్షల ఉద్యోగం వదులుకొని... గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్

కలల కొలువు..లక్షల్లో జీతాలు హైఫై జీవితం మంచి ప్రతిభ కనబరిస్తే విదేశీ యానం. ఇంకేముంది యువత కోరుకునేది ఇదే కదా జీవితం అనుకుంటే పొరపాటే.

Update: 2024-01-03 04:08 GMT

దిశ, తాడ్వాయి: కలల కొలువు..లక్షల్లో జీతాలు హైఫై జీవితం మంచి ప్రతిభ కనబరిస్తే విదేశీ యానం. ఇంకేముంది యువత కోరుకునేది ఇదే కదా జీవితం అనుకుంటే పొరపాటే. అలాంటి ఉద్యోగం సైతం వదులుకొని పుట్టిన ఊరి అభివృద్ధి కొరకు పాటు పడేందుకు తాడ్వాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబడి గెలుపొందిన బండారి సంజీవులు అనతి కాలంలోనే గ్రామ ప్రజల మన్ననలు పొందారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామనికి చెందిన బండారి సంజీవులు ఒక సాధారణ ఓ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఇతను అంచేలంచలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి హైదరాబాద్‌లోని వేరువేరు సాఫ్ట్ వెర్ కంపెనీలల్లో ఉద్యోగం సాదించారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఎదిగిన ఇతను పుట్టి పెరిగి గ్రామ అభివృద్ధికి ఏదో ఒకటి చెయ్యాలని తలంపు చేశారు. దీంతో తాడ్వాయి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగటంతో గ్రామ ప్రజలు సంజీవును ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్నారు.

కొత్త ఒరవడికి నాంది పలికాడు

గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో నెలలో ఒక వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక్కొక్కటిగా గ్రామ అభివృద్ధిలో శ్రమధానం కార్యక్రమ పనులు చేపడుతూ.. శనివారం రివ్యూ చేసి గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించడం, మంకీ ఫ్రూట్ పార్క్ లో గ్రామంలో పుట్టినరోజు జరుపుకునే వారితో ఒక మొక్కను నటించడం. తాడ్వాయి స్వచ్ఛ శ్రమధానం లాంటి కొత్త ఆలోచనకు బాటలు వేశారు. ప్రధాన కూడల్లా వద్ద హైమాస్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ లాంటి అభివృద్ధి పనులు చేశారు. తాడ్వాయి గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వివిధ క్రీడా అంశాలల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ప్రోత్సాహం అందజేయడంలో ముందుంటారు. దీంతో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం ఆయనకు సాటి లేరని గ్రామస్తులు అంటున్నారు. విద్యావంతుడు అయిన సంజీవులు గ్రామస్థుల నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదని దృఢ సంకల్పంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చుట్టూ ప్రక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచాడు.

Similar News