సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాలి

సమాజంలో అందరి జీవన హక్కులు గౌరవిస్తు గౌరవప్రదమైన జీవన గమనాన్ని కొనసాగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్పేశ్వర్‌లు తెలిపారు.

Update: 2024-03-22 12:22 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: సమాజంలో అందరి జీవన హక్కులు గౌరవిస్తు గౌరవప్రదమైన జీవన గమనాన్ని కొనసాగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్పేశ్వర్‌లు తెలిపారు. పొక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సైబర్ క్రైమ్, తదితర చట్టాలపై రూపొందించిన లఘుచిత్రం అద్భుతమైన కళాకండమని వారు విశ్లేషించారు. నేరాలు, శిక్షలు, సంస్కరణలు, నేర బాధితులకు పరిహారం, న్యాయ సహాయం, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సామాజిక సేవ తదితర అంశాలపై చిత్రంలో చిత్రీకరించిన తీరును వారు అభినందించారు నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ రూపొందించిన లఘుచిత్రాని వారు ఉష మల్టీప్లెక్స్‌లో వీక్షించిన అనంతరం మాట్లాడారు. బాలలపై ఏ రకమైన హింసనైన, అఘాయిత్యానైన అరికట్టడానికి పౌర సమాజ సహకారం చాలా అవసరమని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. బాలల సంరక్షణ, పోషణ, రక్షణకు చట్టం పూర్తి రక్షణగా నిలబడుతుందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ…. బాల్యవివాహాలు, బాలలతో కూలి పని చేయించడం, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం అవిరల కృషిచేస్తున్నదని పేర్కొన్నారు.

క్రిమినల్ నేరాల్లో బాధితులైన వారికి జిల్లా అధికార యంత్రాంగం తగిన పరిహారం అందిస్తూ అండగా నిలబడుతుందని కలెక్టర్ తెలిపారు. నేరమయ సంస్కృతిని అంతం చేయడంలో పోలీసు శాఖ శ్రమిస్తుందని పోలీస్ కమిషనర్ కల్పేశ్వర్ అన్నారు. బాలల, మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు విధులు నిర్వహిస్తాయని తెలిపారు. ప్రేరణ లఘుచిత్రం వీక్షణ కార్యక్రమంలో న్యాయ సేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. జీవన గమనాన్ని కొనసాగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్పేశ్వర్ వ్యాఖ్యానించారు. పొక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సైబర్ క్రైమ్, తదితర చట్టాలపై రూపొందించిన లఘుచిత్రం అద్భుతమైన కళాకండమని వారు విశ్లేషించారు. నేరాలు,శిక్షలు, సంస్కరణలు, నేర బాధితులకు పరిహారం, న్యాయ సహాయం, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సామాజిక సేవ తదితర అంశాలపై చిత్రంలో చిత్రీకరించిన తీరును వారు అభినందించారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ రూపొందించిన లఘుచిత్రాని వారు ఉషా మల్టీప్లెక్స్‌లో వీక్షించిన అనంతరం మాట్లాడారు.


Similar News