ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి..నీట మునిగిన ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని
దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గ్రామం గోదావరి నది పరివాహక ప్రాంతం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి గ్రామ పక్కన ప్రవహించే గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వెనుక భాగంలో గల ఉమ్మెడ గ్రామంలో ఉమామహేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైన మహిమాన్వితం కలది. ఉధృతంగా గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో భారీ స్థాయిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరిగిపోవడంతో ఉమ్మడలోని మహిమాన్విత ఆలయమైన ఉమామహేశ్వర ఆలయం నీట మునిగింది.