గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులును సన్మానించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు..

ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను సన్మానించారు.

Update: 2024-10-04 14:56 GMT

దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ ఆలూరు అభివృద్ధికి అన్ని వివిధ సహాయ సహకారాలు చేస్తామని, అన్ని విధాలా తోడు ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు బార్ల ముత్యం రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నవనీత్, సంతోష్, కోశాధికారిగా సుమన్, గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జాన్, రాములును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ మల్లరెడ్డి, మూలకిడి శ్రీనివాస్ రెడ్డి, బీరయ్య, నారాయణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News