తండాల ప్రజలు ప్రతినిత్యం ప్రకృతితో మమేకం

దట్టమైన అడవి ప్రాంతంలో గల తండాల ప్రజలు ప్రతినిత్యం ప్రకృతితో మమేకమై ఉంటారని, అడవి ప్రాంతంలో నివసించే బిడ్డలు మంచికి ప్రతిరూపమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-02-15 14:18 GMT

దిశ, ఆర్మూర్: దట్టమైన అడవి ప్రాంతంలో గల తండాల ప్రజలు ప్రతినిత్యం ప్రకృతితో మమేకమై ఉంటారని, అడవి ప్రాంతంలో నివసించే బిడ్డలు మంచికి ప్రతిరూపమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మాణిక్ బండార్ తండా, ఆమ్రద్ తండాలలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదట ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సేవలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను అడవి బిడ్డలకు అందజేశారు. ఈ సందర్భంగా తండా ప్రజలను ఉద్దేశించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలన్నారు. తండాల అభివృద్ధికి తను మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అన్ని పార్టీలకు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా అడవి బిడ్డల తండాల అభివృద్ధికి కలిసికట్టుగా ఉండి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ ఎంపీడీవో, బీజేపీ మాక్లూర్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News