రెండు రోజుల్లో డబ్బులు డ్రా అయ్యేలా చేస్తా

ఖాతాలో జమ అయిన డబ్బులను రెండు రోజుల్లో డ్రా అయ్యే విధంగా టెక్నికల్ ఇష్యూను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు.

Update: 2024-01-29 13:12 GMT

దిశ, భిక్కనూరు: ఖాతాలో జమ అయిన డబ్బులను రెండు రోజుల్లో డ్రా అయ్యే విధంగా టెక్నికల్ ఇష్యూను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ మాడుగుల నర్సింహులు యాదవ్ గ్రామ స్వరాజ్ పోర్టల్ కింద రూ. 20 లక్షలు జమ అయి ఉన్నాయని, వాటిని డ్రా చేసుకునేందుకు వెళితే డబ్బులు డ్రా కావడం లేదనే విషయాన్ని కామారెడ్డి పట్టణానికి వెళ్లి డీపీఓను తన ఛాంబర్‌లో సోమవారం కలసి పరిస్థితి వివరించారు. రెండు రోజులు అయితే పదవీకాలం ముగుస్తుందని ఆలోపు సమస్యను పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఐదు రోజుల క్రితమే ఖాతాలో జమ చేసిందని, వాటిని బ్యాంకు పాస్ బుక్ లో కూడా ఎంట్రీ చేయించడం జరిగిందన్నారు. అయితే ఆ పోర్టల్‌కు సంబంధించిన కంప్యూటర్‌లో డబ్బులు కనబడకపోవడం వలన డబ్బులు డ్రా కావడం లేదని వివరించారు. దీనికి డీపీఓ శ్రీనివాసరావు స్పందిస్తూ టెక్నికల్ సమస్యల వల్ల డ్రా కావడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చూస్తానన్నారు. ఒక్క జంగంపల్లి గ్రామ పంచాయతీకే ఆ విధంగా డబ్బులు జమైతే జిల్లాలో ఉన్న పలు గ్రామపంచాయతీలో కోట్ల రూపాయలు ఖాతాలో జమ అయి ఉంటాయని, తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్యను త్వరగా పరిష్కరించేలా చూడాలని నర్సింహులు యాదవ్ విజ్ఞప్తి చేశారు.


Similar News