జర్నలిస్టుల కార్యక్రమాలు అభినందనీయం..

మతసామరస్యానికి ప్రతీకగా జర్నలిస్తులు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు.

Update: 2025-03-23 16:12 GMT
జర్నలిస్టుల కార్యక్రమాలు అభినందనీయం..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 23: మతసామరస్యానికి ప్రతీకగా జర్నలిస్తులు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనారిటీల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తాహెర్ బిన్ హందాన్ కొనియాడారు. హిందూ ముస్లింలు సోదర భావంతో ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రంజాన్ మాసంను పురస్కరించుకుని మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో తాహెర్ బిన్ హందాన్ తో పాటు మాజీ కార్పొరేటర్ ఖుద్దుస్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్,ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, బైర శేఖర్ కార్యవర్గ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు,బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు మునీర్ రషీద్ జర్నలిస్టులు పాల్గొన్నారు.


Similar News