భిక్కనూరు టోల్ ప్లాజా ఏర్పాటుపై తెరపైకి వస్తున్న చర్చ..!
టోల్ ప్లాజా అసలు ఈ ప్లేస్ లో ఉండొచ్చా...

దిశ,భిక్కనూరు : టోల్ ప్లాజా అసలు ఈ ప్లేస్ లో ఉండొచ్చా... ఈ ప్లాజా కి మరో టోల్ ప్లాజా కి మధ్య 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలా...! కానీ ఏ లెక్కన చూసినా కామారెడ్డి జిల్లా భిక్కనూరు హైవేపై ఉన్న టోల్ ప్లాజా ఇక్కడ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదన్న వాదన తెరపైకి వచ్చింది. గత పది సంవత్సరాలుగా టెంపరరీగా కొనసాగుతున్న టోల్ ప్లాజా వద్ద, 20 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రతి ఒక్క వాహనానికి ఎగ్జమ్షన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ టోల్ ప్లాజా ఏర్పాటు పై ఎవరూ అంతగా పట్టించుకోలేకపోయారు. అయితే గత కొద్ది రోజుల క్రితం కాంట్రాక్టు తీసుకున్న యాజమాన్యం, స్థానికుల నుంచి కూడా జబర్దస్త్ గా టోల్ వసూల్ చేస్తుండడం లోకల్ వాహనదారులను ఆలోచనలో పడేలా చేసింది.
టోల్ ప్లాజా కి మరో టోల్ ప్లాజా కి మధ్య 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలని హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ చెబుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా తూప్రాన్ టోల్ ప్లాజాకు 55, ఇందల్వాయి టోల్ ప్లాజా కు 35 కిలోమీటర్ల దూరం కూడా లేని ఈ ప్లేస్ లో టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం గైడ్ లైన్స్ కు విరుద్ధమని వాహనదారుల నుంచి వాదన వాహనదారుల్లో నుంచి వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ కొనసాగిస్తున్న ప్లాజా పై హైవే అథారిటీ గాని, అధికార యంత్రాంగం గాని ఎందుకు రెస్పాండ్ కావడం లేదన్నది వాహనదారుల్లో నెలకొన్న అనుమానం.
స్థానికుల నుంచి జబర్దస్త్ గా వసూళ్లు..
ప్లాజా వద్ద ఎవరికి ఎగ్జమ్షన్ ఇవ్వకుండా, కొత్తగా కాంట్రాక్ట్ తీసుకున్న యాజమాన్యం, జబర్దస్త్ గా టోల్ వసూల్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 20 కిలోమీటర్ల మేర దూరంగా ఉండే గ్రామాలకు ఉచిత అనుమానితుల ఇవ్వాల్సింది పోయి, స్ట్రిక్ట్ గా టోల్ వసూల్ చేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వాహనదారులు, ప్లాజా వద్దకు వెళ్లి రెండు మూడు సార్లు గొడవ చేయగా, మండలంలోని ఒక గ్రామానికి, సైడ్ నుంచిఎగ్జమ్షన్ ఇవ్వగా, అతి సమీపంలో ఉన్న గ్రామాల వాహనదారులకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ పంపాలని కొందరు వాహనదారులు నిర్ణయించుకున్నారు. వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూల్ చేస్తున్న యాజమాన్యం, టెంపరరీగా కొనసాగిస్తున్న ఈ ప్లాజా వద్ద ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేవు.
ఎగ్జమ్షన్ కాదు... పాస్ తీసుకోవాలి...
హైవే అథారిటీ బైలా ప్రకారం టోల్ ప్లాజా సరౌండింగ్ లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహనాలకు మాత్రం ఎగ్జమ్షన్ ఉండదు.కేవలం టోల్ ప్లాజా యాజమాన్యం లోకల్ వాహనాల వివరాలు నమోదు చేసుకొని పాసులు ఇష్యూ చేస్తారు.