యువకుడి హల్‌చల్.. ఎన్ కౌంటర్ చేయండంటూ ఎస్సై కి సవాల్..

ఏదో రకంగా నిత్యం నన్ను వేధించే బదులు ఒక్కసారిగా ఎన్

Update: 2025-03-26 15:35 GMT
యువకుడి హల్‌చల్.. ఎన్ కౌంటర్ చేయండంటూ ఎస్సై కి సవాల్..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఏదో రకంగా నిత్యం నన్ను వేధించే బదులు ఒక్కసారిగా ఎన్ కౌంటర్ చేయండంటూ నిజామాబాద్ నగరంలో ఓ యువకుడు ఫిఫ్త్ టౌన్ ఎస్ఐ కి సవాల్ విసురుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తా వద్దకు వస్తానని, అక్కడే నన్ను ఎన్ కౌంటర్ చేసుకోవాలని ఛాలెంజ్ విసిరిన యువకుడు నాలుగైదు నెలల క్రితం నిజామాబాద్ మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై హత్యాయత్నం చేసిన కేసులో రసూల్ నిందితుడు కావడం గమనార్హం. రెండు నెలల క్రితమే రసూల్ కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

సెల్ఫీ వీడియోలో సవాల్ చేసినట్లుగానే బుధవారం రసూల్ మధ్యాహ్నం నెహ్రూ చౌరస్తాకు వచ్చి హల్ చల్ చేయడం నగరంలో చర్చనీయాంశమైంది. తన భూమిని కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నాడని, అడిగితే చంపుతానని భయపెడుతున్నందుకే దండు శేఖర్ పై దాడి చేశానని అప్పట్లో కూడా రసూల్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా మరో సెల్ఫీ వీడియో తో వార్తల్లో నిలిచాడు. తనను ఎస్ఐ బీఆర్ఎస్ మనిషిగా ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తుండటాన్ని భరించలేక పోతున్నానని వీడియోలో పేర్కొన్నారు. రసూల్ సెల్ఫీ వీడియోనే హల్ చల్ చేసిందంటే, ఆయన చెప్పినట్టుగా నెహ్రూ చౌరస్తాకు వచ్చి నిల్చోవడం మరింత చర్చనీయాంశమైంది. వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతోనే రసూల్ ఇలా సెల్ఫీ వీడియో పోస్ట్ చేసాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News