దిశ ఎఫెక్ట్.. విద్యుత్ లైన్ సవరణ

Update: 2024-08-26 14:31 GMT

దిశ, భిక్కనూరుః వారం రోజులుగా కరెంటు సరఫరా బంద్, ఎండిపోతున్న పంట పొలాలు అన్న శీర్షికన దిశ వెబ్ లో వచ్చిన వార్తకు ట్రాన్స్ కో అధికారులు స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన తెగిపడిపోయిన కరెంటు వైర్ల స్థానంలో కొత్తగా కరెంటు స్తంభాలు ఏర్పాటుచేసి లైన్లు పునరుద్ధరించారు. దీంతో వారం రోజు పది రోజులుగా పంట పొలాలకు నీళ్లపారకం లేక పంటలు ఎండిపోతాయోనన్న భయంతో ఆందోళన చెందిన రైతులకు ఉపశమనం లభించినట్లు అయ్యింది. భిక్కనూరు మండల కేంద్రంలోని కొత్త దళిత వాడలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన మరమ్మతు పనులు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ బాలరాజు, లైన్ మెన్ పెక్టర్ శ్రీకాంతo మాణిక్యం, రవిచంద్రలు "దిశ" తో మాట్లాడుతూ డైలీ వర్షం పడడం వలన పంట పొలాల్లో నీరు చేరి, స్తంభాలు పాతే, వాహనాలు ఎక్కడ దిగబడతాయో నన్న ఉద్దేశం తోనే, మరమ్మతు పనుల్లో కొంత ఆలస్యమైందన్నారు. 


Similar News