సిలిండర్ పేలి పూర్తిగా ఇల్లు దగ్ధం.. మంటల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం

నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకేజీతో సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన సాలూరలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-08-31 04:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకేజీతో సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన సాలూరలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోతుగంటి దాము అనే వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న రేకుల ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈలోపు సిలిండర్ కూడా పేలడంతో ఇల్లు, ఇంట్లోని బట్టలు, వస్తువులు, సామాగ్రి అంతా ఖాళీ బూడిదైయిపోయింది. ప్రమాదంలో సూమారు రూ. 2.50 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా పూర్తిగా మంటల్లో కాలిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం అధికారులను వేడుకుంటుంది.


Similar News