సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ : పోచారం శ్రీనివాస రెడ్డి

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ అని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

Update: 2023-02-16 15:40 GMT

దిశ, బాన్సువాడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ అని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని కోటగిరి మండలం సుద్దులం తాండాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లకు శంకుస్థాపన, జగదాంబ, సేవాలాల్ మహరాజ్ ల మందిరానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నదన్నారు. మరే రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు లేవన్నారు. కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

    నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్నదే తన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 11,000 రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం వస్తుందని, అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News