తహసీల్దార్ పనితనం.. ఇసుక లేక ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు

ఇసుక ఉందని, ఇల్లు కడుదామని ముందరేసుకొంటే రెవెన్యూ ఆఫీసర్లు

Update: 2024-03-25 13:23 GMT

దిశ,భీంగల్ : ఇసుక ఉందని, ఇల్లు కడుదామని ముందరేసుకొంటే రెవెన్యూ ఆఫీసర్లు ఇసుక ఇవ్వకపోవడంతో ఇండ్ల పని ఆగిపోయిందని భీంగల్ పట్టణ ప్రజలు వాపోతున్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్ల యజమానులు నిబంధనలకు అనుగుణంగా ఇసుక కోసం ఒక్క ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.920 చొప్పున సుమారు 600 డీడీ లను బాధితులు చెల్లించారు. ఆ డీ.డీ లు తీసి 45 రోజులు అవుతున్న తహసీల్దార్ ఇసుక ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు . ఇసుక లేక ఇంటి నిర్మాణం పనులు ఆగిపోయాయని స్థానిక సర్వ సమాజ్ పాలక వర్గాన్ని భాధితులు ఆశ్రయించగా వారు తహసీల్దార్ ను ఇసుక ఇవ్వాలని కోరిన ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇసుక ఇవ్వడానికి ససేమీరా అంటున్నట్లు స్థానికులు అంటున్నారు.

ఇంకా రెండు వారాలు ఇలాగే ఇసుక ఇవ్వకపోతే తాము కట్టిన డీ. డీలు ఎక్స్పైరీ అవుతాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. డీ డీ లు ఎక్సపైర్ అవుతే తిరిగి డీడీలు తిరిగి తియ్యాలంటే డీడీ కి రూ.25 ఎక్సట్రా కట్టి డీ డీ తీయాల్సి ఉంటుందని అంటున్నారు.ఈ వారంలో ఇసుక ఇవ్వకుండా రెవెన్యూ ఆఫీసర్లు ఇబ్బందులకు గురిచేస్తే తామందరం రోడ్డు ఎక్కి ధర్నా చేస్తామని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక కోసం డీడీలు కట్టిన వారికి వెంటనే ఇసుక ఇవ్వాలని బాధితులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.


Similar News