ఆలూర్ 11 స్టార్ ఆధ్వర్యంలో 22 వ వార్షికోత్సవ శరన్నవరాత్రి వేడుకలు

Update: 2024-10-06 08:52 GMT

దిశా ఆలూర్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారు ఆదివారం రోజున లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలూరు మండల కేంద్రంలో 11 స్టార్ ఆధ్వర్యంలో 22వ శరన్నవరాత్రి వేడుకలును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు 9 రోజులపాటు మండపంలో ప్రత్యేక పూజలు, ప్రతిరోజు ఒక్కో అవతారంలో మాత దర్శనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో 11 స్టార్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News