కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆర్మూర్ పోలీసులు సంయుక్తంగా శనివారం చేపూర్ గ్రామంలోని ఒక బీఆర్ఎస్ నాయకుడు ఓ అధికారికి సంబంధించిన ఫాం హౌస్ పై దాడి చేశారు.
ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంత పోలీసుల రాకను చూసి పరారీ అయినట్లు తెలిసింది. రెండవ శనివారం కావడంతో చాలా మంది అధికారులు, లీడర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.