రూ.50 లక్షలు పెట్టారు.. చెత్త సామాన్లలో పడేశారు...

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గత మున్సిపల్ చైర్ పర్సన్ హయాంలో రూ.50 లక్షలు పెట్టి అత్యాధునిక హంగులు కలిగిన అధునాతనమైన స్వీపింగ్ మిషన్ ను కొనుగోలు చేశారు.

Update: 2024-07-07 09:59 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గత మున్సిపల్ చైర్ పర్సన్ హయాంలో రూ.50 లక్షలు పెట్టి అత్యాధునిక హంగులు కలిగిన అధునాతనమైన స్వీపింగ్ మిషన్ ను కొనుగోలు చేశారు. స్వీపింగ్ మిషన్ ను కొనుగోలు చేసిన గత చైర్పర్సన్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభించిన సుమారు అర్థ నెలలోనే ఆ మిషన్ చెడిపోయింది. 50 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి ఆర్భాటంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి తీసుకొచ్చిన స్వీపింగ్ మిషన్ కేవలం 15 రోజుల్లోనే మూతపడింది. గత ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం అధికారుల నిర్లక్ష్యం వల్ల స్వీపింగ్ మిషన్ నిర్వహణ, మరమ్మత్తులు చేయకపోవడంతో మూలన పడ్డది. ఆర్మూర్ మున్సిపల్ లో 50 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ చెత్త సామాన్ల చెంతకు చేరి ఆర్మూర్ మున్సిపల్ లో పడి ఉంది.

అసలు 50 లక్షలు విలువ చేసి కొనుగోలు చేయాల్సిన స్వీపింగ్ మిషన్ ఊడ్చే స్థాయిలో ఆర్మూర్ లోని రెండు మూడు ప్రధాన రోడ్లు మినహా, అన్ని రోడ్లు మొదటగా లేనేలేనట్లు తెలుస్తుంది. అప్పనంగా ఆర్మూర్ మున్సిపల్ నుంచి సుమారు 50 లక్షల ప్రజాధనాన్ని స్వీపింగ్ మిషన్ కోసం వృధాగా ఖర్చు చేశారని, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ మిషన్ ను కనీసం ఆర్మూర్ మున్సిపల్ లో సాధ్యమైన రోడ్ల నైనా పరి శుభ్రపరిచేందుకు వాడుకోవడం లేదని, మరమ్మత్తులు నిర్వహణ లేక చెత్త సామాన్ల దగ్గర పడి ఉండడం పట్టి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు మున్సిపల్ పాలకవర్గ అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికైనా 50 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ కు మరమ్మత్తులు చేయించి దానిని వాడుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ జనం కోరుతున్నారు.


Similar News