గల్ఫ్ సమస్యలపై గళమెత్తండి...

గల్ఫ్ బాధితుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిపై అసెంబ్లీలో గళమెత్తాలని జిడబ్ల్యూఎసి రామారెడ్డి మండల అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని కోరారు.

Update: 2024-10-05 10:39 GMT

దిశ, కామారెడ్డి : గల్ఫ్ బాధితుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటిపై అసెంబ్లీలో గళమెత్తాలని జిడబ్ల్యూఎసి రామారెడ్డి మండల అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని కోరారు. ఎమ్మెల్యే కెవిఆర్ బేహ్రాయిన్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న సురేందర్ రెడ్డి వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. గల్ఫ్ లో పనిచేస్తున్న చాలామంది వలస కార్మికులు తెలిసి తెలవక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రశ్నించే గొంతుకగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల్ఫ్ బాధితుల కష్టనష్టాలను సభలో ప్రస్తావించాలని కోరారు. గతంలో గల్ఫ్ బాధితులకు కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని, ఎన్ఆర్ఐ పాలసీ అమలు కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే గల్ఫ్ బాధితుల కోసం ఎన్నారై సెల్ అమలు చేసి 500 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. అలాగే తన సొంత గ్రామం రెడ్డిపేట అభివృద్ధిపై దృష్టి సారించాలని, కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.


Similar News